వినాయక విగ్రహాలు ఏర్పాటు నిషేధం ప్రజలు సహకరించాలని యస్ ఐ శ్రీహరి విజ్ఞప్తి

కోవిడ్ వైరస్ అతి తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న కారణంగా రాబోయే వినాయక చవితి పండగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వినాయక చవితి పందిళ్లు ఏర్పాటు చేయటం మరియు విగ్రహాలను పెట్టడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కాబట్టి ప్రజలు ప్రభుత్వం యొక్క తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించాలని పొదిలి ఎస్ఐ శ్రీహరి గురువారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.

 

వినాయక చవితి పర్వదినాన్ని మీ ఇంట్లోనే మీ కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవాలని అలా కాకుండా కరోనా వైరస్ తీవ్రతను పెంచే విధంగా ప్రభుత్వం ఆంక్షలను ధిక్కరించి బహిరంగ ప్రదేశాల్లో పందిర్లు, విగ్రహాలు ఏర్పాటు చేసి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని అట్టి వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్ఐ శ్రీహరి తెలిపారు.