పొదిలి లో ఘనంగా పవన్ కళ్యాణ్ ఇమ్మడి జన్మదిన వేడుకలు
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 50వ జన్మదిన వేడుకలు మరియు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జ్ ఇమ్మడి కాశీనాథ్ వేడుకలను పొదిలి పట్టణంలో ఘనంగా నిర్వహించారు.
స్థానిక విశ్వనాధపురం ఎస్ ఆర్ కళ్యాణమండపం నందు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 50 కేజీల భారీ కేకును జనసేన పార్టీ లీగల్ సెల్ జిల్లా కార్యదర్శి నాగరాజు కోసి కార్యకర్తలకు పంచిపెట్టారు.
అనంతరం జనసేన పార్టీ కార్యకర్తలకు మరియు అభిమానులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
స్థానిక పాత నగర పంచాయతీ కార్యాలయం వద్ద జనసేన పార్టీ కార్యకర్తలు ఏర్పాటుచేసిన ప్రత్యేక కేక్ ను లక్ష్మి కోసి అభిమానులకు పంచిపెట్టారు.
స్థానిక పియన్ఆర్ కాలనీ నందు పవన్ కళ్యాణ్ అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ ను కోసి అభిమానులకు పంచిపెట్టారు.
అదే విధంగా పొదిలి మండలం పరిధిలోని వివిధ గ్రామాల పవన్ కళ్యాణ్ అభిమానులు మరియు జనసేన పార్టీ కార్యకర్తలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ ను కోసి అభిమానులకు పంచిపెట్టారు.
పొదిలి మండలంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు సంబరాలు అంబరాన్ని తాకేలా నిర్వహించారు.
అనంతరం నగర పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు అన్నదానం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు