మెరుగైన సదుపాయాలతో ప్రభుత్వం వైద్యశాలను అభివృద్ధి చేస్తాం: శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి
పొదిలి పట్టణములోని ప్రభుత్వం వైద్యశాల అభివృద్ధి కమిటీ సమావేశంలో మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి మాట్లాడుతూ మెరుగైన సదుపాయాలతో ప్రభుత్వం వైద్యశాలను అభివృద్ధి చేస్తామని అన్నారు.
శనివారం నాడు స్థానిక ప్రభుత్వ వైద్యశాల నందు శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి అధ్యక్షతనతో ప్రభుత్వం వైద్యశాల అభివృద్ధి కమిటీ తొలి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శాసనసభ్యులు వైద్యశాలలో నందు పనిచేస్తున్న సిబ్బంది వివరాలు, కావలసిన సిబ్బంది వివరాలు , మౌళిక సదుపాయాలు, మొదలైన విషయాల గురించి చర్చించారు.
మరోసారి సమగ్ర సమాచారం తో సమావేశం అవుదామని తెలిపారు.
ఈ సమావేశంలో ప్రభుత్వం వైద్యశాల ప్రధాన వైద్యులు డాక్టర్ చక్రవర్తి, ఈఓఆర్డీ రాజశేఖర్, కమిటీ సభ్యులు కసిరెడ్డి భాగ్యలక్ష్మి,షేక్ బందిసాహేబ్, కొత్తురి రమేష్ శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతిరావు తదితరులు పాల్గొన్నారు