మహిళా పోలీసుల శిక్షణ తరగతులు ప్రారంభం

మహిళా పోలీసుల శిక్షణ తరగతులను పొదిలి సిఐ సుధాకర్ రావు లాంఛనంగా ప్రారంభించారు.

పొదిలి పట్టణంలోని స్థానిక సాయి బాలాజీ కళ్యాణ మంటపం నందు శనివారం నాడు మహిళా పోలీసుల శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి ఈ శిక్షణ తరగతుల్లో పొదిలి,మర్రిపుడి,కొనకనమీట్ల, తర్లబాడు, దొనకొండ మండలాలకు చెందిన 90 మంది మహిళ పోలీసులకు 10వ తేదీ వరకు శిక్షణ తరగతులు జరుగుతాయని‌ పొదిలి సిఐ సుధాకర్ రావు తెలిపారు.

యస్ఐ శ్రీహరి అధ్యక్షతనతో శిక్షణ తరగతులను ప్రారంభించారు.