బిసి కులగణన దీక్షకు మద్దతు ప్రకటించిన నూకసాని,పొల్లా

కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన జనగణన తోపాటు కులగణన చెప్పట్టాలని కోరుతూ బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఒంగోలు ప్రకాశం భవనం వద్ద తలపెట్టిన దీక్షకు తెలుగు దేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ కమిటీ అధ్యక్షులు నూకసాని బాలాజీ కార్యనిర్వహణ కార్యదర్శి పొల్లా నరసింహా యాదవ్ మద్దతు ప్రకటించారు.

 

ఈ సందర్భంగా నూకసాని బాలాజీ మాట్లాడుతూ దేశంలో అత్యధిక జనాభా కలిగిన బీసీల లెక్కలను స్వాతంత్ర్యం వచ్చి 75 తర్వాత కూడా కులగణన లెక్కించలేదన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కమిషన్లు నియమించిన వాటి నివేదికలు ఇప్పటి వరకు అమలుకు నోచుకోవడం లేదన్నారు. బీసీల ప్రధానమంత్రి అని చెపుకున్నే మోది బీసీల కులగణన చెప్పట్టి తన చిత్తశుద్ధిని నిరుపించుకోవలని అన్నారు.

 

కులగణనకు తెలుగు దేశం పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు.