బహిరంగ ప్రదేశాల్లో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు: సిఐ సుధాకర్ రావు వెల్లడి

ప్రభుత్వ ఆదేశాలు ధిక్కరించి బహిరంగ ప్రదేశాల్లో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ‌పొదిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రావు తెలిపారు.

స్థానిక పొదిలి పోలీస్ స్టేషన్ లోని కాన్ఫరెన్స్ హాలులో సోమవారం నాడు గ్రామ సర్పంచులు విగ్రహాలు తయారీ యజమానులు గ్రామ పెద్దలతో ఎస్ ఐ శ్రీహరి అధ్యక్షతనతో సమావేశం నిర్వహించారు.

ఈ ఈ సందర్భంగా సీఐ సుధాకర్ రావు మాట్లాడుతూ ప్రజా ఆరోగ్యం దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం వినాయక చవితి పండగ సందర్భంగా బహిరంగ ప్రదేశాలలో విగ్రహాలను పెట్టటం నిషేధం విధించింది కావున ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యత తో ప్రతి ఒక్కరూ సహకరించి ఇంట్లోనే వినాయక చవితి పండుగ జరుపుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఆముదాలపల్లి గ్రామ సర్పంచ్ సిరి మల్లెశ్రీనివాస్ యాదవ్ , పండు అనీల్, సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు