ఇల్లు మూరెడు బిల్లు బారెడు విద్యుత్ శాఖ లీలలతో సామాన్యుడు బలి…

అధికారుల నిర్లక్ష్యం కారణంగా 4 రొజులనుంచి చీకట్లో గడుపుతున్న కుటుంభం…

పొదిలి నగర పంచాయితీ చెందిన చంటి అనే వ్యక్తి వృత్తి రిత్యా పట్టణంలోని ఒక బార్బర్ షాపులో కూలి పనుచేసుకుంటు జీవితం గడుపుతున్నాడు… అతనికి విద్యుత్ శాఖ ఇచ్చిన కరెంట్ బిల్ తో దిక్కుతొచని పరిస్థితి లో వున్నాడు… ప్రతి నెల క్రమం తప్పకుండా కరెంట్ బిల్లు కడుతు వస్తున్నాడు… ఇటివల విద్యుత్ శాఖ అధికారులు తన ఇంటి మీటరును మార్చారు… మిటర్ మార్చి నప్పటినుంచి కరెంట్ బిల్ చూసి లబొదిబొ అంటున్నాడు… ప్రతి నెల 5వందలనుంచి 6 వందలలోపు వచ్చే బిల్లు ఒక్కసారిగా 70 వేల రూపాయలు వచ్చింది.. దీంతొ విద్యుత్ అధికారులను సంప్రదిస్తే ముందుగా 15 వేలు కట్టు ప్రతి నెల మిగతా బకాయి చెల్లించు అని చెప్పడంతో నిశ్చేష్టుడయ్యాడు… బిల్ కట్టలేని అని చెప్పడంతో 4రొజులు క్రితం అతని ఇంటికి కరెంట్ కట్ చేసారు.. అప్పటినుంచి చీకట్లో కాలం వెల్లదిస్తున్నాడు…

 

నగర పంచాయితీ లోని 1వ వార్డు లో నివసించే కొటమ్మ అనే వృద్ద మహిళ ఒంటరిగా ఒక రేకుల ఇంట్లో నివాసం వుంటు కాలం వెల్లదిస్తుంది ఆమెకు ఒక్కసారిగా 30 వేల రూపాయల కరెంట్ బిల్ వచ్చింది.. దింతొ ఆమె ఏమి చేయలేక నిస్సహాయ స్థితిలో వుంది… ప్రకాశంజిల్లా ప్రాతినిధ్యం వహిస్తున్న విద్యుత్ శాఖ మంత్రి జిల్లాలోనే‌ ఈ విధంగా వుంటే అధికారుల తీరును పలువురు విమర్శిస్తున్నారు… ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కరెంట్ బిల్లులు సక్రమంగా వుండేట్లు చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు