అచ్చం నాయుడు ను కలిసిన పొదిలి తెదేపా నాయకులు
తెలుగు దేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు అచ్చం నాయుడు ను ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ కమిటీ అధ్యక్షులు నూకసాని బాలాజీ కార్యనిర్వహణ కార్యదర్శి పొల్లా నరసింహా యాదవ్ ,తెలుగు యువత నాయకులు బత్తుల వెంకటేష్ యాదవ్, ముని శ్రీనివాస్ లు తాడేపల్లి లోని రాష్ట్ర పార్టీ కార్యాలయం నందు మంగళవారం నాడు కలిసారు.
ఈ సందర్భంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చం నాయుడు స్థానిక సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు . రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాటాలు చేస్తు ప్రజల్లో మమేకం కావాలని స్థానిక సమస్యలపై ప్రజా ఉద్యమాలను నిర్వహించి ప్రభుత్వం మెడలు వంచే విధంగా పని చెయ్యాలని పార్టీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని పొదిలి పట్టణం చెందిన నాయకులకు భరోసా ఇచ్చారు