కందుల అరెస్టును నిరసిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన
పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ కు నికర జలాలు కేటాయించాలని కోరుతూ మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి తలపెట్టిన కాగడాల ప్రదర్శన అడ్డుకొని హౌస్ అరెస్టు చేయడం పట్ల నిరసనగా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.
బుధవారం నాడు స్థానిక రథం రోడ్డు నుంచి పెద్ద బస్టాండ్ వరకు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గునుపూడి భాస్కర్ పార్లమెంట్ కమిటీ కార్యదర్శి యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, మైనారిటీ విభాగం ఒంగోలు పార్లమెంట్ కమిటీ అధ్యక్షులు షేక్ రసూల్, తెలుగు నాడు విద్యార్థి సమాఖ్య పార్లమెంట్ కమిటీ కార్యదర్శి షేక్ గౌస్ బాషా, మండల పార్టీ అధ్యక్షులు మీగడ ఓబుల్ రెడ్డి పట్టణ అధ్యక్షులు ముల్లా ఖూద్దుస్, మండల నాయకులు పండు అనీల్, నరసింహారావు, తెలుగు యువత నాయకులు కాటూరి శ్రీను ముని శ్రీనివాస్, తెలుగు మహిళ నాయకురాలు షేక్ షన్వాజ్ తదితరులు పాల్గొన్నారు