డెంగ్యూ కేసు నమోదు అప్రమత్తమైన నగర పంచాయతీ అధికారులు
పొదిలి పట్టణము నందు ఒక డెంగ్యూ కేసు నమోదు కావడంతో అప్రమత్తమైన నగర పంచాయతీ అధికారులు పట్టణంలో నివారణ చర్యలు చేపట్టారు.
ఎక్కడైతే నీళ్లు నిల్వ ఉంటాయో… అక్కడ డెంగీ దోమలు సంతానోత్పత్తి చేస్తుంటాయి. ఉదా.. ఇంటి ఆవరణలో కొబ్బరి చిప్పలు, పాత నీళ్ల బాటిళ్లు, టైర్లు, పెంకులు ఇలా రకరకాల వస్తువుల్లో నీళ్లు నిల్వ ఉంటే లార్వా వృద్ధి చెందుతుంది. కాబట్టి పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండి ముందు జాగ్రత్త తగు చర్యలు తీసుకోవాలని వైద్య అధికారులు కోరుతున్నారు.
ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతిరావు తదితరులు పాల్గొన్నారు