పేద రెడ్ల అభివృద్ధికి పాటుపడతా – రెడ్డి కార్పొరేషన్ చైర్మెన్ చింతలచెరువు సత్యనారాయణ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ రెడ్డి కార్పొరేషన్ చైర్మెన్ చింతలచెరువు సత్యనారాయణ రెడ్డి కనిగిరి వెళ్తా మార్గం మధ్యలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వాగతం పలికారు. అనంతరం మార్కాపురం క్రాస్ రోడ్ వద్ద ఉన్న వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ‌రెడ్లు అభివృద్ధి కృషి చెస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు ఉడుముల శ్రీనివాసులురెడ్డి, మర్రిపుడి, కొనకనమీట్ల ఎంపిపి అభ్యర్థులు వాకా వెంకట రెడ్డి, మూరబోయిన మురళి న్యాయవాది ఉడుముల లక్ష్మి రెడ్డి తదితరులు పాల్గొన్నారు