పొదిలి మండలం లో భూమి పూజలు
పొదిలి మండలంలోని ఉప్పలపాడు, తలమల్ల,మాదాల వారి పాలెం, కాటూరి వారి పాలెం, పొదిలి నందు రెండో విడత వైయస్సార్ జగనన్న కాలనీలకు శంఖుస్థాపన నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ నియోజకవర్గం ప్రత్యేక అధికారి మండల రెవెన్యూ తహశీల్దారు షేక్ మహమ్మద్ రఫీ మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీకృష్ణ ఈఓఆర్డీ రాజశేఖర్, నగర పంచాయితీ కమీషనర్ భవాని ప్రసాద్, వివిధ గ్రామ పంచాయతీల సర్పంచ్ లు పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు