ఫ్రెండ్స్ ఫరెవర్ టీమ్ ఆధ్వర్యంలో అంత్యక్రియలు

కరోనా రెండో దశలో కోవిడ్ తో మృతి చెందిన పలువురుకి అంత్యక్రియలు నిర్వహించి పట్టణ ప్రజల మన్ననలు పొందిన ఫ్రెండ్స్ ఫరెవర్ టీమ్ సోమవారం నాడు మరో మృతదేహాన్ని కి అంత్యక్రియలు నిర్వహించారు.

పొదిలి పట్టణంలోని విశ్వనాథపురంకు చెందిన ఒక వ్యక్తి కోవిడ్ తో మృతి చెందటంతో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించాలని ఫ్రెండ్స్ ఫరెవర్ టీమ్ కోరడంతో సోమవారం నాడు స్థానిక హిందూ స్మశానం నందు అంత్యక్రియలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో షేక్ గౌస్ మొహిద్దీన్,షేక్ రఫీ, షేక్ షాకీర్,షేక్ ఖలీల్,పఠాన్ రబ్బానీ, ముల్లా షాహీర్, ముల్లా హన్ను, షేక్ రబ్బానీ, ముల్లా జిలాని,షేక్ నాసర్, కోగర సుబ్రహ్మణ్యం,షేక్ ఖాదర్ బాషా తదితరులు పాల్గొన్నారు