టి యన్ యస్ యఫ్ రాష్ట్ర కార్యదర్శి గా పండు అనీల్
తెలుగునాడు విద్యార్థి సమాఖ్య (టి యన్ యస్ యఫ్ ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి గా వరికుంట్ల అనిల్ (పండు) నియమిస్తూ తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చం నాయుడు ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు.
పొదిలి మండలం కుంచేపల్లి గ్రామానికి చెందిన వరికుంట్ల అనిల్ తెలుగు దేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తు మార్కాపురం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డికి ముఖ్య అనుచరుడు గుర్తింపు పొంది ఇటివల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కుంచేపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా తన తల్లి వరికుంట్ల కాంతమ్మ ను గెలుపించు కోవటం ద్వారా పార్టీలో తన పట్టును నిరూపించుకున్నారు.
తనకు పదవి లభించుటకు కృషిచేసిన ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ కమిటీ అధ్యక్షులు నూకసాని బాలాజీ మార్కాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ కందుల నారాయణరెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.