వరల్డ్ యూత్ పార్లమెంట్ కు ఎంపికైన ప్రకాశం జిల్లా యువకుడు

బలమైన సంకల్పం కృషి మరియు అభిరుచి ఉన్నట్లుయితే ఎన్ని అడ్డంకులు ఎదురైనా విజయ తీరానికి చేరువ అవుతాడని అనే దానికి ప్రకాశం జిల్లా మర్రిపుడి మండలం చిమట గ్రామానికి చెందిన యువకుడు షేక్ ఇస్మాయిల్ ఒక ఉదాహరణ.

భారత పార్లమెంట్ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో జైపూర్ నందు సెప్టెంబర్ 16,17,18 తేదీ ల్లో జరిగిన యూత్ పార్లమెంట్ సమావేశాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తరపున తన గళాన్ని వినిపించి‌ ప్రపంచ యూత్ పార్లమెంట్ సమావేశాలకు భారత్ నుంచి ఎంపికైన ముగ్గురిలో ఆంధ్రప్రదేశ్ చెందిన యువకుడు షేక్ ఇస్మాయిల్ కూడా ఎంపికై కావటం జరిగింది

జైపూర్ యూత్ పార్లమెంట్ సమావేశాల్లో ఉత్తమ ప్రతిభ చూపి మూడో స్థానంలో ఉన్న షేక్ ఇస్మాయిల్ అరుణాచల్ ప్రదేశ్ లో జరిగే యూత్ పార్లమెంట్ సమావేశాల్లో ఉత్తమ ప్రతిభ చూపితే త్వరలో జరిగే ప్రపంచ యూత్ పార్లమెంట్ సమావేశాలకు భారత్ తరపున నాయకత్వం వహించే అవకాశం ఉంది

జైపూర్ యూత్ పార్లమెంట్ సమావేశాల్లో భారత దేశం లోని మహిళా ఋతుస్రావ సమయంలో
వాడుతున్న శాంట్రీ ప్యాడ్స్ పై జియస్డీ రద్దు చేయాలని అదే విధంగా దేశవ్యాప్తంగా మహిళలకు శాంట్రి ప్యాడ్స్ ఉచితం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని
ఆంధ్రప్రదేశ్ తరపున పాల్గొన్న షేక్ ఇస్మాయిల్ కీలకమైన ప్రసంగం యూత్ పార్లమెంటులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

అదేవిధంగా క్రీడలు మౌలిక సదుపాయాలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విద్యాభ్యాసం మొదలగు అంశాల గురించి ప్రసంగించారు.

భారత పార్లమెంట్ ప్రతి సంవత్సరం నిర్వహించే యూత్ పార్లమెంట్ సమావేశాలకు ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రకాశం జిల్లా మరిపూడి మండలం చెమట గ్రామం నుంచి ఎంపికై సమావేశంలో కీలకమైన ప్రసంగాలు చేసి అటు నిర్వాహకుల మన్ననలు పొంది స్వగ్రామంలో ప్రజల అభిమానాన్ని చోరగన్నారు.

 

ఈ సందర్భంగా షేక్ ఇస్మాయిల్ ఎక్స్ క్లూజివ్ గా పొదిలి టైమ్స్ తో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ తరఫున యూత్ పార్లమెంట్ సమావేశాలకు ప్రాధాన్యత వహించటం చాలా సంతోషంగా ఉందని అతి పేద కుటుంబం నుంచి నేను ఇటువంటి పెద్ద సమావేశాలకు ఎంపిక కావడం నా అదృష్టం గా భావిస్తు భారత పార్లమెంట్ వ్యవహారాల శాఖ ఇలాంటి సమావేశాలు నిర్వహించడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థ పై యువతుల్లో స్ఫూర్తి నింపి బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటు చేయగలమని ఆశాభావం వ్యక్తంచేశారు.

 

 

పేద కుటుంబం నుంచి నేను ఎలాంటి అత్యున్నత సమావేశంలో పాల్గొన్నటకు నిరంతరం నాకు సహాకారం అందిస్తున్న మామ మరియు కుటుంబం సభ్యులే కారణం అని షేక్ ఇస్మాయిల్   అన్నారు.