నూకసాని బాలాజీని కలిసిన బాబురావు యాదవ్
తెలుగు దేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ కమిటీ అధ్యక్షులు నూకసాని బాలాజీని కొనకనమీట్ల మండల తెలుగు దేశం పార్టీ మండల అధ్యక్షులు మూరబోయిన బాబురావు యాదవ్ పుష్పగుచ్చం అందించి ధన్యవాదాలు తెలిపారు.
బుధవారం నాడు కొనకనమీట్ల మండల తెలుగు దేశం పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మూరబోయిన బాబురావు యాదవ్ గురువారం ఒంగోలు పార్లమెంట్ తెలుగు దేశం పార్టీ కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ కమిటీ అధ్యక్షులు నూకసాని బాలాజీని కలిసారు.
ఈ సందర్భంగా పార్లమెంట్ కమిటీ అధ్యక్షులు నూకసాని బాలాజీ మాట్లాడుతూ నూతన అధ్యక్షులు ఎన్నికైన మూరబోయిన బాబురావు యాదవ్ అభినందిస్తూ పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ నిరంతరం అధికార వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలపై మరియు స్థానిక సమస్యలపై నిరంతరం పోరాటం చెయ్యాలని ఎల్లవేళలా నేను అందుబాటులో ఉంటానని తెలిపారు.
ఈ భేటీ లో పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మారెళ్ళ వెంకటేశ్వర్లు, కార్యనిర్వహణ కార్యదర్శి పొల్లా నరసింహా యాదవ్ కార్యదర్శి యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, పొదిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ చప్పిడి రామ లింగయ్య, మాజీ మండల అధ్యక్షులు కనకం నరసింహారావు, పొదిలి మండల తెలుగు దేశం పార్టీ నాయకులు సన్నెబోయిన సుబ్బారావు, సన్నెబోయిన రాంబాబు, తోట మోహన్, తెలుగు యువత నాయకులు కనకం వెంకట్రావు యాదవ్ చిట్టిబోయిన విజయ్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు