ప్రభుత్వ భూములను కాపాడటంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కేసు నమోదు
ప్రకాశం పొదిలి మండలం నందు ప్రభుత్వం భూమిని ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు చెప్పటిన ఎలాంటి చర్యలు తీసుకొని ఐదుగురు ప్రభుత్వం అధికారులపై మరియు ఒక అక్రమదారుడు పై పొదిలి మండల రెవెన్యూ తహశీల్దారు షేక్ మహమ్మద్ రఫీ శుక్రవారం రాత్రి పొదిలి పోలీసు స్టేషన్ ఫిర్యాదు చేశారు.
పొదిలి గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ 840 లో 0.90 సెంట్లు,833లో 0.87 సెంట్లు, వాగు పోరంబోకు, 480/1 లోని ఎకార 1.58 సెంట్లు కుంట పోరంబోకు భూమి నందు అక్రమ నిర్మాణాలు జరుగుతున్న చర్యలు తీసుకోలేదని ప్రత్యేక సబ్ కలెక్టర్ శ్రీదేవి ఇచ్చిన నివేదిక ప్రకారం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు తహశీల్దారు రఫీ ఇచ్చిన ఫిర్యాదుపై కాటూరి వెంకటేశ్వర్లు (పదవి విరమణ ఉద్యోగి) నక్కా బ్రహ్మ నాయుడు (పంచాయతీ కార్యదర్శి) ప్రస్తుత నగర పంచాయితీ కమీషనర్, భవాని ప్రసాద్, టౌన్ ప్లానింగ్ అధికారి, షేక్ రహామతుల్లా ఇరిగేషన్ డిఇ, మేకా శివరామ్ ప్రసాద్, వెలిశెట్టి వెంకటేశ్వర్లు అక్రమదారుడు పై పొదిలి పోలీసు స్టేషన్ నందు 447,468,471,409,420, ఐపిసి సెక్షన్ల కింద యస్ఐ శ్రీహరి కేసు నమోదు చేశారు.