నూకసాని , దామచర్ల లను కలిసిన పండు అనీల్
తెలుగు దేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ కమిటీ అధ్యక్షులు నూకసాని బాలాజీ ని ఒంగోలు లోని తన స్వగృహంలో తెలుగు నాడు విద్యార్థి సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి వరికుంట్ల అనిల్ (పండు) మొక్క ను అందించి మర్యాద పూర్వకంగా కలిసారు.
ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ విద్యార్థి సమస్యలపై పోరాటం చెయ్యాలని కోరారు. అనంతరం తెలుగు దేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్ధన్ ను కలిసి మొక్క ను అందించి మర్యాద పూర్వకంగా కలిసినట్లు తెలుగు నాడు విద్యార్థి సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి వరికుంట్ల అనిల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు నాడు విద్యార్థి సమాఖ్య పార్లమెంట్ కమిటీ అధ్యక్షులు రవితేజ కార్యదర్శి షేక్ గౌస్ బాషా తదితరులు పాల్గొన్నారు.