పొదిలి టైమ్స్ కథనానికి స్పందన అక్రమ నిర్మాణాలు సీజ్ చేసిన మున్సిపల్ కమిషనర్
పొదిలి పట్టణంలోని అక్రమ నిర్మాణాలను మున్సిపల్ కమిషనర్ భవాని ప్రసాద్ ఆధ్వర్యంలో సీజ్ చేశారు.
వివరాల్లోకి వెళితే మున్సిపల్ కమిషనర్ భవాని ప్రసాద్ మీడియా తో మాట్లాడుతూ పొదిలి గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ 840, 833 లోని వాగు , వాగుపోరంబోకు, కుంట పోరంబోకు భూముల నందు అక్రమంగా నిర్మించిన 15 నిర్మాణాలను సీజ్ చేస్తామని నివాసం ఉంటున్న 6 గృహలకు నోటీసులు జారీ చేసి విద్యుత్ సరఫరాను నీటి సరఫరా ను నిలిపివేస్తున్నట్లు తెలిపారు.
నూతనంగా నిర్మాణాలు చెప్పట్టే వారు అన్ లైన్ ద్వారా ప్లాన్ ఆమోదం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అట్టి వారికి తక్షణమే అనుమతి మంజూరు చేస్తామని తెలిపారు.
మున్సిపల్ అనుమతి లేకుండా అక్రమంగా నిర్మాణాలు చెప్పట్టితే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతిరావు, కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి మరియు నగర పంచాయితీ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు