యస్ ఆర్ చిన్న పిల్లల వైద్యశాలను ప్రారంభించిన కుందూరు
విజయదశమి పండుగ పర్వదినం సందర్భంగా స్థానిక విశ్వనాధపురం నందు నూతనంగా నిర్మించిన యస్ఆర్ చిన్న పిల్లల వైద్యశాలను మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో యస్ఆర్ చిన్న పిల్లల వైద్యశాల వైద్యులు షేక్ రఫీ, షేక్ షహీదా , మర్రపూడి మండల పరిషత్ అధ్యక్షులు వాకా వెంకట రెడ్డి,మాజీ జెడ్పీటీసీ సభ్యులు సాయి రాజేశ్వరరావు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు కల్లం వెంకట సుబ్బారెడ్డి గొలమారి చెన్నారెడ్డి, జి శ్రీనివాసులు, షేక్ ఖాదర్ భాషా తదితరులు పాల్గొన్నారు