21,22 తేదీలో రెవెన్యూ స్పందన కార్యక్రమాలు : తహశీల్దారు రఫీ
ప్రకాశం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు పొదిలి మండములంలోని 17 గ్రామ సచివాలయల్లో తేదీ 21,22వ తేదీలో ఉదయం 9:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు రెవిన్యూ స్పందన కార్యక్రమం జరుగుతుందని పొదిలి మండల రెవెన్యూ తహశీల్దారు షేక్ మహమ్మద్ రఫీ తనను కలిసిన విలేఖరులతో తెలిపారు.
ఈ సందర్భంగా మీడియాతో తహశీల్దారు షేక్ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ ఈ ప్రత్యేక కార్యక్రమము నందు రెవిన్యూ శాఖలోని భూమి సంబంధిత సమస్యలు/ సేవలు అనగా మ్యుటేషన్ సేవలు, వెబ్ ల్యాండ్ అడంగిల్ నందు పెట్టాదారులకు సంబందించిన మార్పులు/ చేర్పులు, ప్రభుత్వ భూమి అసైన్మెంట్ ఇంటి స్థలం మంజూరు మరియు ప్రభుత్వభూమి ఆక్రమణల తొలగింపు, భూమి హద్దుల సమస్యలు చుక్కల భూములు, నిషేధిత భూముల జాబితాలో సవరణలు, అభ్యంతరతరం కాని ప్రభుత్వ భూములలోని ఆక్రమిత నివాస గృహాల క్రమబద్ధీకరణ, సర్వ సమస్యల మీద మీకు సమీప గ్రామ సచివాలయములోని గ్రామ రెవిన్యూ అధికారి మరియు గ్రామ సర్వయర్లు ఆర్జీలను స్వీకరించి రశీదు ఇస్తారని తెలిపారు.
ఈ కార్యక్రమములో వచ్చిన అన్నీ అర్జీలను కంప్యూటరీకరణ చేసి, ఒక ప్రత్యేక రిజిష్టరు లో నమోదుచేసి కనిష్టము 15 రోజుల నుంచి గరిష్టముగా 30 రోజులలో పరిష్కరించుటకు గాను కలెక్టర్ మార్గదర్శకాలు నిర్దేశించి యున్నారని అన్నారు.
కావున పొదిలి మండలములోని యావన్మంది రైతులు, ప్రజలు మరియు ప్రజాప్రతినిధులు ఈ అవకాశాన్ని వినియోగించు కోవలసినదిగా తహశీల్దారు షేక్ మహమ్మద్ రఫీ తెలిపారు.