రెవెన్యూ స్పందన 96 దరఖాస్తులు
పలు సచివాలయలను సందర్శించిన ప్రత్యేక అధికారి
పొదిలి మండలం పరిధిలోని 16 గ్రామ సచివాలయల్లో ప్రత్యేక రెవెన్యూ స్పందన కార్యక్రమంకు మొదటి రోజున 96 దరఖాస్తులు వచ్చినట్లు తహశీల్దారు షేక్ మహమ్మద్ రఫీ తెలిపారు.
పొదిలి మండల పరిధిలోని కంభాలపాడు , మాదాలవారిపాలెం, కొండాయిపాలెం సచివాలయంల్లో
మార్కాపురం నియోజకవర్గం ప్రత్యేక అధికారి బిసి కార్పొరేషన్ ఈడి వెంకటేశ్వర్లు, మండల రెవెన్యూ తహశీల్దారు షేక్ మహమ్మద్ రఫీలు సందర్శించారు.
తహశీల్దారు షేక్ మహమ్మద్ రఫీ యోలురు , ఉప్పలపాడు,తలమల్ల గ్రామ సచివాలయలను సందర్శించి రెవెన్యూ స్పందన కార్యక్రమం యొక్క వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో పొదిలి మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ కిలారి సుబ్బారావు, సర్వేయర్ బ్రహ్మం, తదితరులు పాల్గొన్నారు.