సహాయ ప్రభుత్వ న్యాయవాదిగా రామారావు నియామకం

పొదిలి పట్టణానికి చెందిన దర్నాసి రామారావును సహాయ ప్రభుత్వ న్యాయవాది గా నియమిస్తూ జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసినట్లు రామారావు సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు.

పొదిలి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నందు మూడు సంవత్సరాల పాటు ప్రభుత్వ సహాయ న్యాయవాది గా పనిచేసే అవకాశం రావడంతో పట్టణంలో పలువురు అభినందించారు.

పొదిలి పట్టణం నేతపాలెం చెందిన దర్నాసి రామారావు విద్యార్థి నాయకుడు, పలు ‌ప్రజా సంఘాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ పొదిలి న్యాయవాది సంఘం అధ్యక్షులు గా పని చేసారు.

ప్రస్తుతం వినియోగదారుల రక్షణ సమితి పొదిలి యూనిట్ అధ్యక్షులు గా పని చేస్తున్నారు.

బిసి ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు మరియు పేదలకు న్యాయ సహాయం అందించడంలో విశేషంగా కృషి చేశారు.

దర్నాసి రామారావు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత స్థాయి పదవులు చేపట్టాలని బంధుమిత్రులు ఆకాంక్ష ఇచ్చారు.