పిచ్చి రెడ్డి కుటుంబానికి మున్సిపల్ చైర్మన్ పదవి – మంత్రి బాలినేని

 

మాజీ శాసనసభ్యులు సానికొమ్ము పిచ్చి రెడ్డి కుటుంబానికి మున్సిపల్ చైర్మన్ పదవి దక్కే విధంగా కృషి చేస్తామని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి అన్నారు.

వివరాల్లోకెళ్తే బుధవారం నాడు స్థానిక సాయి కళ్యాణ మండపం నందు జరిగిన మాజీ శాసనసభ్యులు పిచ్చి రెడ్డి సంతాప సభలో విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 1999 సంవత్సరంలో రెండోసారి శాసనసభ్యులుగా ఎంపికైన సానికొమ్ము పిచ్చిరెడ్డి తోపాటు తాను కూడా తొలిసారిగా శాసనసభ్యుడు గా విజయం సాధించిన అనంతరం ఐదు సంవత్సరాల ప్రతిపక్ష పాత్రలో పిచ్చి రెడ్డి గారితో కలిసి పనిచేయటం జరిగిందని ఆయనకు ప్రతి శాఖ పట్ల సంపూర్ణ అవగాహన కల్గి నిరంతరం తన శాసనసభ స్థానం పరిధిలో అభివృద్ధి కోసం శ్రమించిన మహోన్నతమైన వ్యక్తి ఆయన సేవలను కొనియాడారు .

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి త్వరలో జరగనున్న పొదిలి మున్సిపల్ ఎన్నికల్లో సానికొమ్ము పిచ్చిరెడ్డి కుటుంబం నుంచి ఛైర్మన్ గా బరిలో ఉండేవిధంగా అవకాశం కల్పిస్తామని మీరు అందరూ పిచ్చి రెడ్డి కుటుంబానికి అండగా నిలవాలని ఆయన కోరారు

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ రూపాయి డాక్టర్ గా పొదిలి పరిసర ప్రాంతాల ప్రజల మన్ననలు పొంది ఒకసారి మండల పరిషత్ చైర్మన్ గా తదుపరి దరిశి నియోజకవర్గం నుంచి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా విజయం సాధించి నియోజకవర్గ అభివృద్ధికి విశేషంగా కృషి చేసారు

సానికొమ్ము పిచ్చి రెడ్డి కుటుంబం నుంచి ఒక్కరికి రాజకీయంగా ఎదిగేందుకు తదుపరి జరిగే మున్సిపల్ ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామని వారి కుటుంబానికి ఎల్లా వేళలా మీరు అండగా ఉండాలని అన్నారు.

మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి అధ్యక్షతన జరిగిన సంతాప సభలో ఆయన మాట్లాడుతూ పొదిలి మున్సిపాలిటీ ఛైర్మన్ గా సానికొమ్ము పిచ్చిరెడ్డి కుటుంబం నుంచి ఎన్నికై విధంగా కృషి చేస్తానని ప్రమాణం చేశారు.

దరిశి శాసనసభ్యులు మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ దరిశి నియోజకవర్గం తలపెట్టే పెద్ద కార్యక్రమాలకు పిచ్చి రెడ్డి పేరుతో ఏర్పాటు చేస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు జంకె వెంకటరెడ్డి,ఉడుముల శ్రీనివాసులురెడ్డి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, మెదరమెట్ల శంకర్ రెడ్డి, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ డైరెక్టర్ కసిరెడ్డి వెంకట రమణారెడ్డి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ లు వై వెంకటేశ్వరరావు జి కోటేశ్వరి ,బన్నీ మరియు స్థానిక వైసిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో వేలాదిగా ప్రజలు తరలివచ్చి సంతాప సభ మరియు అన్నదాన కార్యక్రమం లో పాల్గొన్నారు