రక్తదానం శిబిరాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు కుందూరు
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగం గురువారం నాడు స్థానిక పొదిలి పోలీసు స్టేషన్ నందు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి ప్రారంభించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి దరిశి డియస్పీ నారాయణస్వామి రెడ్డి సిఐ సుధాకర్ రావు యస్ఐలు శ్రీహరి, సుబ్బారాజు ప్రసంగించారు.
అనంతరం రక్తదానం శిబిరంలో మర్రిపూడి యస్ఐ సుబ్బారాజు కొనకనమీట్ల యస్ఐ శివ మరియు సర్కిల్ పరిధిలోని పోలీసులు రక్తదానం చేశారు.
పొదిలి పట్టణంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరల్లో ఇప్పటి వరకు ఉన్న అత్యధికంగా సేకరించిన రికార్డులను బ్రేక్ చేసి రక్తదాతల నుంచి రక్తాన్ని స్వీకరించారు.
పొదిలి సిఐ సుధాకర్ రావు యస్ఐ శ్రీహరి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.