పొదిలి డిపో ను సందర్శించిన ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్
పొదిలి పట్టణంలోని రోడ్డు రవాణా సంస్థ చెందిన డిపో మరియు బస్టాండ్ ను సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు గురువారం నాడు సందర్శించారు.
తొలుత ఆర్టీసీ గ్యారేజ్ నందుశాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి తో భేటీ అయ్యి అనంతరం గ్యారేజ్ నందు మొక్క ను నాటి అనంతరరం సిబ్బంది తో సమావేశం నిర్వహించారు తదుపరి బస్టాండ్ పరిసరాలను పరిశీలించారు.
అనంతరం మీడియా ప్రతినిధులు బస్టాండ్ నందు మంచినీటి సరఫరా లేదని, మురుగుదోడ్ల సౌకర్యం లేకపోగా అధిక ధరలు వసూలు చేస్తున్నారని, కార్గో డెలివరీ సరిగా చెయ్యటం లేదని పలు అంశాలను దృష్టికి తీసుకొని రావటంతో ఇంకా నుంచి ఎలాంటి సమస్యలు లేకుండా చూస్తానని తెలిపారు.
పొదిలి వాసవీ కాంప్లెక్స్ వద్ద ఉన్న ఆర్టీసీ బస్టాండ్ స్థలాన్ని మున్సిపల్ కార్యాలయంకు బదలాయింపు అంశాన్ని మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు దృష్టికి తీసుకొని రాగా పరిశీలించిన తదుపరి ఒక నిర్ణయానికి వస్తామని తెలిపారు.
తదుపరి వాసవీ కాంప్లెక్స్ వద్ద గల ఆర్టీసీ బస్టాండ్ ను సందర్శించి సంబంధించిన దస్త్రాలను పరిశీలించారు.
ఆర్టీసీ రీజనల్ మేనేజర్, దరిశి డియస్పీ నారాయణస్వామి రెడ్డి,పొదిలి సిఐ సుధాకర్ రావు మరియు ఆర్టీసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Delete