అన్నదాత సుఖీభవ ఏడాదిగా అన్నార్తుల కడుపు నింపుతున్న లాల్ ఫౌండేషన్

ఆకలితో ఉన్నవాడికి పట్టెడంత అన్నం పెడుతూ, వందలాది మంది అన్నార్తుల కడుపు నింపుతు మానవత్వన్ని చాటుకుంటున్నారు.
అన్ని దానాల్లో కంటే అన్నదానం మిన్న అనే మాటకు లాల్ ఫౌండేషన్ ఆదర్శంగా నిలుస్తుంది.
ఆకలితో ఉన్నవాడికి పట్టెడంత అన్నం పెడుతూ, వందలాది మంది అన్నార్తుల కడుపు నింపుతున్నారు. మానవత్వన్ని చాటుకుంటున్నారు. లక్షలాది మంది ఆకలి తీర్చేందుకు, పొదిలి చిన్న మసీద్ వద్ద లాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రారంభించిన ఉచిత అన్నదాన కేంద్రం ఈ నెల 29కి మూడు వసంతాలు పూర్తి చేసుకుంది.

గత సంవత్సరం అక్టోబర్ 29వ తేదీన లాంఛనంగా ప్రారంభించిన అన్నదాన కార్యక్రమం ఒక సంవత్సరం కాలం పూర్తి చేసుకొని నేడు శుక్రవారం నాడు రెండవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా స్థానిక చిన్న మసీద్ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సివి రామన్ విద్యాసంస్థల డైరెక్టర్ దుగ్గపూడి వెంకటేశ్వరరావు చేతల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

అనంతరం సంస్థ డైరెక్టర్ అలీ హజీర్ ను ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ లాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించటం గొప్ప విషయం ఇలాంటి మరిన్నో కార్యక్రమాలను నిర్వహించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో లాల్ ఫౌండేషన్ కోఆర్డినేటర్ షేక్ షర్మిల, సిపిఎం ప్రాంతీయ కార్యదర్శి ఎం రమేష్, ఉపాధ్యాయ నాయకులు దాసరి గురుస్వామి, విశ్రాంత ఉద్యోగులు ముల్లా జిలానీ, బిఇడి కళాశాల ఉద్యోగులు షేక్ లాడ్డు ఖాసిం తదితరులు పాల్గొన్నారు.