దేవస్థానం భూముల ఆక్రమణలకు పాల్పడితే క్రిమినల్ చర్యలు – ఇన్స్పెక్టర్ శైలేంద్ర కుమార్
దేవస్థానం భూముల ఆక్రమణలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని దేవాదాయ ధర్మాదాయ శాఖ కందుకూరు ఇన్స్పెక్టర్ శైలేంద్ర కుమార్ అన్నారు.
స్థానిక శివాలయం నందు శనివారం నాడు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో శైలేంద్ర కుమార్ మాట్లాడుతూ పొదిలమ్మ దేవస్థానం చెందిన 6 ఎకరాల 5 సెంట్లు భూమి లో అక్రమంగా నిర్మించిన నిర్మాణాల పైనా న్యాయస్థానాన్ని ఆశ్రయించే ప్రక్రియ లో ఉన్నామని సదరు అక్రమ నిర్మాణాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ప్రస్తుతం ఖాళీగా ఉన్న మిగతా రెండు ఎకరాల భూమిని రక్షించేందుకు ప్రహరీ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు.
ఇకపై ఎవరైనా దేవాదాయశాఖ భూములను ఆక్రమిస్తే క్రిమినల్ చర్యలు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.
ఈ సమావేశంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి నిమ్మగడ్డ వెంకట రవికుమార్, సీనియర్ అసిస్టెంట్ కాటూరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు