జె సి శర్మ కమిషన్ నివేదికను వెంటనే అమలు చేయాలి
బుడగ జంగాలకు కుల ధ్రువీకరణ పత్రాలు నిలిపివేయటం ని నిరసిస్తూ ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు బుడగ జంగాల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో తలపెట్టిన సైకిల్ యాత్ర శనివారం నాడు పొదిలి పట్టణంకు చేరింది.
స్థానిక ఏబియం స్కూల్ వద్ద ఉన్న అంబేద్కర్ మరియు జగ్జీవన్ రావు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం రాష్ట్ర అధ్యక్షులు ఎలమర్తి మధు మాట్లాడుతూ యస్సీ జాబితా లో బుడగ జంగాల కులం 2008 వరకు కుల ధృవీకరణ పత్రాలు ఇచ్చారని జిఓ నెంబర్ 144/2008 ప్రకారం బుడగ జంగాలు కు కుల ధృవీకరణ పత్రాలు నిలిపివేయటం జరిగిందని దేశం లో కుల ధృవీకరణ పత్రం నోచుకోని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నావని ఆవేదన వ్యక్తం చేశారు.
వై ఎస్ ఆర్ జె ప్రజా సంకల్ప పాదయాత్ర సమయంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి తమ కులానికి అడ్డుగా ఉన్న జీవో ని తొలగించి కుల ధ్రువీకరణ పత్రాలు ఇచ్చే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారని ఆ హామీ నిలుపు నిలుపుకునేందుకు జేసీ శర్మ కమిషన్ ఏర్పాటు చేసి నివేదికను ప్రభుత్వానికి అందించినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జెసి శర్మ నివేదికను అమలు చేయాలని
డిమాండ్ చేశారు.
లేకపోతే ఇచ్చాపురంలో జరిగే మహా బహిరంగసభకు నందు మా తడాఖా చూపిస్తాం అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు సిరిగిరి మన్యం, మహిళా అధ్యక్షురాలు ఊర లత, జిల్లా అధ్యక్షులు హనుమంతరావు, దశరథ తదితరులు పాల్గొన్నారు