పాతపాడు సమీపంలో పొదిలి యువకుడు మృతి

కొనకనమిట్ల మండలం పాత పాడు గ్రామం సమీపంలో ఒంగోలు నంద్యాల రాష్ట్ర రహదారి పై పొదిలి పట్టణం చెందిన గర్నెపూడి రామారావు మృతి చెందిన సంఘటన గురువారం రాత్రి చోటుచేసుకున్నట్లు కొనకనమిట్ల  ఎస్సై శివ సామాజిక మాధ్యమాల ద్వారా శుక్రవారం నాడు ఒక ప్రకటన విడుదల చేశారు.

మృతదేహానికి స్థానిక పొదిలి ప్రభుత్వ వైద్యశాల నందు పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పజెప్పారు.

రామారావు మృతిపట్ల బంధు వర్గాలలో పలు అనుమానాలను లేవనెత్తారు.
పోస్టుమార్టం నివేదిక వచ్చిన తదుపరి అసలు విషయం వెలుగులోకి వస్తుందని పోలీసు వర్గాలు తెలిపాయి