శాసనసభ్యులు కుందూరు ఆధ్వర్యంలో పాదయాత్ర
వైయస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటికీ ప్రారంభించి నాలుగు సంవత్సరాల పూర్తి అయిన సందర్భంగా మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక విశ్వనాదపురం ఆంజనేయ స్వామి గుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి పాదయాత్ర ను మొదలు పెట్టి అనంతరం తెలుగు బాప్టిస్ట్ చర్చి, పెద్ద మసీదు లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి పెద్ద బస్టాండ్, వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి అక్కడ నుంచి చిన్న బస్టాండ్ వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సానికొమ్ము శ్రీనువాసులరెడ్డి, మర్రిపూడి మండల పరిషత్ అధ్యక్షులు వాకా వెంకట రెడ్డి,కొనకనమీట్ల మండల పరిషత్ అధ్యక్షులు మోరబోయిన మురళి కృష్ణ యాదవ్, జెడ్పీటీసీ సభ్యులు అక్కిదసరి ఏడుకొండలు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు సాయి రాజేశ్వరరావు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు కల్లం వెంకట సుబ్బారెడ్డి ,గొలమారి చెన్నారెడ్డి , పుల్లగోర్ల శ్రీనివాస్ యాదవ్, షేక్ రబ్బానీ,వినోద్ కుమార్, యర్రం వెంకట రెడ్డి, తదితరులు పాల్గొన్నారు