రేపు కందుల ఆధ్వర్యంలో రాజధాని రైతుల పాదయాత్ర సంఘీభావ భిక్షాటన

మార్కాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం నాడు పొదిలి పట్టణంలో బిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పొదిలి మండల,పట్టణ అధ్యక్షులు మీగడ ఓబుల్ రెడ్డి,ముల్లా ఖూద్దుస్ సామాజిక మాధ్యమాల ద్వారా ఆదివారం నాడు ఒక ప్రకటన విడుదల చేశారు.

న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు అమరావతి రాజధాని రైతులు తలపెట్టిన మహా పాదయాత్ర కు సంఘీభావంగా మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 10 గంటలకు స్థానిక చింతచెట్టు సెంటర్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి చిన్న బస్టాండ్ వరకు బిక్షాటన కార్యక్రమం జరుగుతుందని కావున ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజలు, తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్ని జయప్రదం చేయాలని ఒక ప్రకటనలో తెలిపారు.