ప్రైవేటీకరణ విధానాలు తిప్పికొట్టిండి- సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ గపూర్

ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ కార్పోరేట్ శక్తులకు దోచిపెట్టే కేంద్ర ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు, కర్నూలు మాజీ శాసనసభ్యులు ఎం ఎ గపూర్ అన్నారు.

శుక్రవారం స్థానిక పశ్చిమ ప్రకాశం జిల్లా కమిటీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనాతో చతికిలపడ్డ ప్రజా జీవనం పై కేంద్ర ప్రభుత్వం
పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లను పెంచి ప్రజానికంపై పెను భారాలు వేసిందన్నారు.

గత 18నెలల కాలంలో పెట్రోల్ 36రూ, డీజిల్ 27 రూ, గ్యాస్ 250రూపాయలకి పైగా పెంచి సామాన్య , మధ్యతరగతి ప్రజానీకం పై అలవికాని భారాన్ని మోపిందన్ని అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గుతున్నప్పటికి మోడీ ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం, రకరకాల సెస్ లు పెంచి రేట్లు పెంచటం ద్వారా 20 లక్షల కోట్ల రూపాయలకు పైగా ప్రజల నుండి ముక్కు పిండి వసూలు చేసిందన్నారు.

వీటి ధరల పెరుగుదలతో నిత్యావసర వస్తువుల, ప్రజా రవాణా, వ్యవసాయంపై భారాలు పెరిగాయన్నారు. ఫలితంగా అన్ని రకాల వస్తువులు ధరలు పెరిగాయన్నారు.

కరోనాతో ఉపాధి కోల్పోయి, వ్యాపారాలు దెబ్బతిని ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలను ఆదుకోకపోగా భారాలు వేయటం ద్వారా వచ్చిన మొత్తాన్ని కార్పోరేట్ లకు రాయితీలు ఇస్తూ ప్రభుభక్తిని చాటుకొంటున్నారు. అంతేకాక ప్రజలు పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు ప్రైవేటు పరం చేయడం దుర్మార్గమన్నారు. 70 సంవత్సరాల స్వతంత్ర భారతంలో పోరాడి సాధించుకున్న హక్కులు, కార్మిక చట్టాలను కాలరాస్తూ, ప్రభుత్వ రంగ సంస్థలకు కారుచౌకగా అమ్మడం బిజెపి మతోన్మాదం విదేశీ విధానాలకు అద్దం పడుతుంది అన్నారు.

మరొక వైపున రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ట్రూఅప్ చార్జీలు వసూలు చేయటంతో పాటు, పట్టణాలు, గ్రామాలలో ఆస్తి, చెత్త పన్నులు పెంచి ప్రజానీకం నడ్డివిరిస్థుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై భారాలు వేయటం మానుకోవాలని, పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లను తగ్గించాలని, నిత్యావసర వస్తువుల ధరలను అదుపులో ఉంచాలని డిమాండ్ చేశారు ఈ విధానాలతో ప్రజల చైతన్యం చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు, రాష్ట్ర నాయకులు జాలా అంజయ్య, పచ్చిమ ప్రకాశం జిల్లా కమిటీ కార్యదర్శి సయ్యద్ హనీఫ్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గాలి వెంకటరామిరెడ్డి,పి.వి.శేషయ్య,యు.రమేష్,వి.ఆంజనేయులు,డి.సోమయ్యలు తదితరులు పాల్గొన్నారు.