రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు ఇద్దరి పరిస్థితి విషమం
ప్రకాశం జిల్లా పొదిలి మండలం కంభాలపాడు – పోతవరం గ్రామల మధ్య శుక్రవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు గాయపడగా వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించారు.
కొనకనమీట్ల మండలం చిన్నరికట్ల గ్రామంలో ఒక శుభ కార్యక్రమంలో పాల్గొన్న అశోక్ రెడ్డి దంపతులు తన కుమారుడు తో ద్విచక్ర వాహనం పై తిరుగు ప్రయాణంలో కంభాలపాడు గ్రామం దాటిన తర్వాత ఎదురుగా తలమల్ల గ్రామం చెందిన వంకాయలపాటి రవి ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు 108 వాహనం ద్వారా పొదిలి ప్రభుత్వ వైద్యశాల కు తరలించారు
క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తరలించారు.