కార్టూన్ ఎగ్జిబిషన్ కు విశేష స్పందన
ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్టూన్ ఎగ్జిబిషన్ కు విశేష స్పందన లభించింది.
ఈ కార్టూన్ ఎగ్జిబిషన్ నందు టైమ్స్ ఆఫ్ ఇండియా ఆంగ్ల పత్రికలో కామన్ మ్యాన్ పేరు తో రాజకీయ కార్టూన్ వేసి విశేష ప్రచారం పొందిన ఆర్కే లక్ష్మణ్ యొక్క వందలాది కార్టూన్ లు విశేషంగా ఆకట్టుకున్నాయి.
అదేవిధంగా స్థానికంగా కార్టూనిస్టుగా చిత్రకారుడిగా ప్రాచుర్యం పొందిన పావులూరి చక్రవర్తి యొక్క భారతీయ నృత్యాలు, పలురకాల చిత్రాలను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమాన్ని హాస్యపు హరివిల్లు పత్రిక సంపాదకులు చీపురు కిరణ్ కుమార్ లాంఛనంగా ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్కే లక్ష్మణ్ శతజయంతి పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఆర్కె కార్టూన్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి విద్యార్థుల్లో సృజనాత్మకత శక్తిని పెంచేందుకు కృషి చేస్తానని తెలిపారు.
బాలికల ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మామిళ్ళపల్లి శ్రీనివాసులు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు.