వైసిపి నుంచి 40 కుటుంబాలు తెలుగు దేశం పార్టీ లో చేరిక

కొనకనమీట్ల మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు మూరబోయిన బాబురావు యాదవ్ ఆధ్వర్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి 40 కుటుంబాలు తెలుగు దేశం పార్టీ చేరారు.

కొనకనమీట్ల మండలం వద్దిమడుగు గ్రామ పంచాయతీ 6వ వార్డు సభ్యులు తమ్మిశెట్టి వెంకటస్వామి నాయకత్వం 40 కుటుంబాలు త మార్కాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి సమక్షంలో చేరారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మూరబోయిన బాబురావు యాదవ్ మరియు మండల తెలుగు దేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు