కొవ్వొత్తులు వెలిగించి నల్ల రిబ్బన్లు తో నిరసన తెలిపిన తెదేపా శ్రేణులు
తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు కొవ్వొత్తులు వెలిగించి నల్ల రిబ్బన్లు తో పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సతీమణి పట్ల శాసనసభ నందు అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ స్థానిక విశ్వనాధపురం నందు మాజీ ఎంపీటీసీ సభ్యులు సయ్యద్ ఇమాంసా ఆధ్వర్యంలో నల్ల రిబ్బన్లు కట్టుకొని తమ నిరసనను వ్యక్తం చేశారు.
అదేవిధంగా పొదిలి పట్టణంలో పలు ప్రాంతాల నందు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కొవ్వొత్తులు వెలిగించి తమ నిరసనను వ్యక్తం చేశారు
పొదిలి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మరియు కంబాలపాడు గ్రామం నందు వివిధ గ్రామాలలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కొవ్వొత్తులు వెలిగించి తమ నిరసనను తెలియజేశారు
మండలంలో పరిధిలోని గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కొవ్వొత్తులు వెలిగించి తమ నిరసన తెలిపారు