కొవ్వొత్తులు వెలిగించి నిరసన వ్యక్తం చేసిన తెలుగుదేశం శ్రేణులు

కొనకనమీట్ల మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు మూరబోయిన బాబురావు యాదవ్ ఆధ్వర్యంలో మండలంలోని పలు గ్రామాల్లో తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు కొవ్వొత్తులు వెలిగించి తమ నిరసనను తెలిపారు.

నిన్న శాసనసభలో చంద్రబాబు నాయుడు సతీమణి పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు కొనకనమీట్ల మండలంలోని ప్రతి గ్రామమునందు కొవ్వొత్తులు వెలిగించి తమ నిరసన తెలియజేసినట్లు బాబురావు యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు