నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కందుల డిమాండ్

నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కందుల డిమాండ్

ఇటివల కురిసిన భారీ వర్షాలకు పంట దెబ్బతిన్న రైతులను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని మార్కాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ కందుల నారాయణరెడ్డి డిమాండ్ చేశారు.

కొనకనమీట్ల మండలం గొట్లగట్టు గ్రామంలో ఇటివల కురిసిన వర్షాలకు దెబ్బతిన్నా మినుము, అలసంద, పొగాకు, మిర్చి పంటలను ఆదివారం నాడు కందుల నారాయణరెడ్డి పరిశీలించారు.

ఈ సందర్భంగా కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వదిలి తక్షణమే పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు మూరబోయిన బాబురావు యాదవ్ ఆధ్వర్యంలో మండలం పరిధిలోని దెబ్బతిన్న పంటలను ఆదివారం నాడు పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో కొనకనమీట్ల, తర్లబాడు, మార్కాపురం మండలాల అధ్యక్షులు మూరబోయిన బాబురావు యాదవ్,ఉడుముల చిన్నపురెడ్డి,జువ్వాజీ రామాంజనేయరెడ్డి ,స్థానిక సర్పంచ్ పెరికే సుఖదేవ్ కొనకనమీట్ల మండల తెలుగు దేశం పార్టీ నాయకులు గోపినాథ్ చౌదరి, పరిటాల సుబ్బాయ్య,పొదిలి తిరుపతియ్య,వేముల శ్రీనివాస్, వంకాయలపాటి వెంకటేశ్వర్లు,పేరం తిరుపతి రెడ్డి, ఇమ్మడిశెట్టి సత్యం, బత్తుల తిరుపతియ్య, మరియు పెద్ద ఎత్తున కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు