రోడ్డు ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాలను పరామర్శించిన యస్ఐ శ్రీహరి
పొదిలి పట్టణంలోని నందు ప్రపంచ రోడ్డు ట్రాఫిక్ బాధితుల రోజు సందర్భంగా పొదిలి యస్ఐ శ్రీహరి ఆధ్వర్యంలో గత రెండు సంవత్సరాల నుంచి రోడ్డు ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాలను పరామర్శించారు.
ప్రతి సంవత్సరం నవంబర్ మూడో ఆదివారంనాడు రోడ్డు ప్రమాదం మరణించిన మరియు గాయపడిన వారి జ్ఞాపకార్థం ప్రపంచ రోడ్డు ట్రాఫిక్ బాధితుల జ్ఞాపకార్థ రోజు ను నిర్వహించడం జరపటం ఆనవాయితీ
అందులో భాగంగా పొదిలి పెద్ద బస్టాండ్ సెంటర్లో సిఐ సుధాకర్ రావు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు
అనంతరం విశ్వనాథపురం,కాటూరివారిపాలెం నందు బాధిత కుటుంబాలను పరామర్శించి వారి యొక్క ప్రస్తుత జీవన శైలి వారికి ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు మొదలైన విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు
సంబంధించిన కేసు గురించి పూర్తిగా అండగా ఉంటామని అదే విధంగా ఇతర సహాయం అందించడంలో కూడా తాము సహకరిస్తామని బాధిత కుటుంబాలకు యస్ఐ శ్రీహరి భరోసా కల్పించారు.
రోడ్డు ప్రయాణం చేసే వాహనదారులు ప్రభుత్వం సూచనలు సలహాలు పాటించటం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు