రోడ్ ప్రమాదంలో యువకుడు మృతి
పొదిలి మండలం కంభాలపాడు వద్ద లారీ ద్విచక్ర వాహనాలు ఢీకొన్న సంఘటనలో ద్విచక్ర వాహనం పై ప్రయాణిస్తున్న వంశీకృష్ణ అనే యువకుడు అక్కడిక్కడే మృతిచెందాగా వంశీతో పాటు ప్రయాణిస్తున్న అతని బందువు నరసమ్మ అనే మహిళా కు స్వల్పగాయాలయ్యాయి.
కొనకమిట్లమండలం గొట్లగట్టు గ్రామంలో ఒక వివాహవేడుకకు హజరై స్వగ్రామమైన మర్రిపూడి మండలం గుండ్లసముద్రంకు వెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం చొటుచేసుకుంది
మృతునికి వివాహం కాలేదు. విషయం తెలుసుకున్న ఎస్ఐ శ్రీహరి సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.