పొదిలి ఆర్టీసీ బస్టాండ్ సందర్శించిన ఈడి

ప్రకాశం జిల్లా పొదిలి రోడ్డు రవాణా సంస్థ బస్టాండ్ ను నెల్లూరు జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గోపినాథ్ రెడ్డి సందర్శించారు.

గత పదిహేను రోజుల క్రితం ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు సందర్శించిన సందర్భంగా ఆయన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించే దిశగా శుక్రవారం నాడు స్థానిక పొదిలి ఆర్టీసీ బస్టాండ్ మరియు గ్యారేజ్ ను ఈడి గోపినాథ్ రెడ్డి సందర్శించి సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు.

అనంతరం మీడియా ప్రతినిధులు పలు సమస్యలను ఈడీ దృష్టికి తీసుకొని రాగా పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు

ఈ పర్యటనలో ఈడి బ్రహ్మానందరెడ్డి, రీజనల్ మేనేజర్, పొదిలి ఆర్టీసీ డిపో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు