దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్
పొదిలి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం నందు వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటల నష్టం గురించి మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
వ్యవసాయ అధికారులు తమ నివేదికలో ఎలాంటి పంట నష్టం జరగలేదని తెలపడంతో రైతులు అభ్యంతరం తెలిపి దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు
తక్షణమే శాసనసభ్యులు జోక్యం చేసుకొని రైతులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో పొదిలి మండల రెవెన్యూ తహశీల్దారు దేవ ప్రసాద్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీకృష్ణ, వ్యవసాయ అధికారి దేవిరెడ్డి శ్రీనివాసులు రైతు సలహా సంఘం సభ్యులు మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు