ఎయిడ్స్ అవగాహన ర్యాలీని ప్రారంభించిన డాక్టర్ చక్రవర్తి
ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా పొదిలి నగర పంచాయితీ పరిధిలోని ప్రభుత్వం వైద్యశాల నందు ఎయిడ్స్ అవగాహన ర్యాలీని ప్రభుత్వం వైద్యులు డాక్టర్ చక్రవర్తి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.
ప్రభుత్వం వైద్యశాల నుంచి చిన్న బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు.
అదేవిధంగా స్థానిక గ్రామీణ మండలం పరిధిలోని ఉప్పలపాడు ప్రభుత్వం వైద్యశాల నందు ర్యాలీని ప్రభుత్వం వైద్య అధికారిణి షేక్ షాహీదా ప్రారంభించారు.
ఈ కార్యక్రమాల్లో ప్రభుత్వం వైద్యులు డాక్టర్ రఫీ మరియు ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది, మరియు మహర్షి విద్యా సంస్థ చెందిన విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు