నగర పంచాయితీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులుగా రమణయ్య యాదవ్

పొదిలి నగర పంచాయితీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులుగా జెంపు రమణయ్య యాదవ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

స్థానిక సాయి బాలాజీ కళ్యాణ మంటపంలో జరిగిన ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం లో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

అనంతరం మండల రెవెన్యూ తహశీల్దారు దేవ ప్రసాద్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీకృష్ణ, ఈఓఆర్డీ రాజశేఖర్, మండల వ్యవసాయ అధికారి దేవిరెడ్డి శ్రీనివాసులు, ప్రభుత్వం వైద్య అధికారిణి షేక్ షాహీదా, పంచాయతీ కార్యదర్శి నక్క బ్రహ్మ నాయుడు సమక్షంలో నూతన కమిటీని ప్రమాణం స్వీకారం చేయించారు.

పొదిలి నగర పంచాయితీ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షులు జి వి సుబ్బారావు అధ్యక్షులు జె రమణయ్య ఉపాధ్యక్షులు ఆర్ లోకేష్ ,ప్రదాన కార్యదర్శి కె విజయ,సహాయ కార్యదర్శిలు ఎన్ శ్రీనివాస రావు, కె అనుషా , యం కుష్బు కార్యవర్గ సభ్యులు కె శారా ,యన్ సాయి క్రిష్ణ ,కె సుబ్బారావు ,డి సుజిత్ బెనహర్ , ఎల్ తులసి,యం నాగమ్మ ,ఎం సాయి తరుణ్ ,టి కుసుమ , పి సుమన్, మొత్తం 16 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.