సాయిబాబా గుడి లో చోరీకి యత్నం

పొదిలి పట్టణం విశ్వనాధపురం లోని సాయిబాబా గుడి నందు మంగళవారం రాత్రి చోరీకి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

సాయిబాబా దేవస్థానం పాలకవర్గం సభ్యులు బుధవారం ఉదయం గుడి తీయటానికి వచ్చిన సందర్భంలో తాళం పగిలి ఉండటం గమనించి గుడి నందు పరిశీలించగా ఐదు వేల రూపాయలు విలువచేసే రెండు వస్తువులు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.