తండ్రి మృతి కేసులో కొడుకు లొంగుబాటు సిఐ సుధాకర్ రావు

కొనకనమీట్ల మండలం నాగంపల్లి గ్రామం నందు గత వారంలో జరిగిన తండ్రి కొడుకుల మధ్య ఘర్షణ లో తండ్రి మృతి చెందిన సంఘటన కేసులో కొడుకు లొంగిపోయినట్లు పొదిలి సిఐ సుధాకర్ రావు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తెలిపారు.

శుక్రవారం నాడు స్థానిక పొదిలి పొదిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం నందు గ్రామ రెవెన్యూ అధికారి సమక్షంలో కుమారుడు వెంకట రాజు లొంగిపోయి తానే హత్య చేసినట్లు నేరం అంగీకరించటంతో అతని అదుపు లోకి తీసుకొని రిమాండ్ కు తరలిస్తున్నట్లు పొదిలి సిఐ సుధాకర్ రావు తెలిపారు.

ఈ విలేఖరుల సమావేశంలో కొనకనమీట్ల యస్ఐ శివ మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు