అంబెడ్కర్ కు ఘనంగా నివాళులు

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ భీం రావ్ రాంజీ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు.

డాక్టర్ బాబాసాహెబ్ భీం రావ్ రాంజీ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా స్థానిక ఎ బి యం స్కూల్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నగర పంచాయితీ కమీషనర్ భవాని ప్రసాద్, శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతిరావు నగర పంచాయితీ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.


స్థానిక మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం నందు అంబెడ్కర్ చిత్రపటానికి తహశీల్దారు దేవ ప్రసాద్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో మండల రెవిన్యూ తహశీల్దారు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు