అంబెడ్కర్ ఆలోచన విధానం తో ముందుకు సాగాలి

అంబెడ్కర్ ఆలోచన విధానం తో ముందుకు సాగాలని పీపుల్స్ ఎడ్యుకేషన్ ట్రాస్ట్ జిల్లా అధ్యక్షులు బి నాగేశ్వరరావు అన్నారు.

స్థానిక మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం నందు పీపుల్స్ ఎడ్యుకేషన్ ట్రాస్ట్ ఆధ్వర్యంలో బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి 66వ వర్థంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడుతూ అంబెడ్కర్ ఆలోచన విధానం తో ముందుకు వెళ్ళి సామాజిక మార్పుతో రాజ్యాధికారంలో వాటా సాధించాలని అన్నారు.

అనంతరం ఇటివల పొదిలి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నందు సహాయ ప్రభుత్వ న్యాయవాదిగా నియమితులైన రామారావును ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో కొప్పుల సుబ్బారావు,ధర్నాసి పెద్దన్న ,గురిజాల బాబురావు, షేక్ హుస్సేన్ పచ్చా , చిట్టిబాబు, కెవి నారాయణ, జెబి షా, డేవిడ్ సన్, ఆనందరావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.