కులవృత్తితో బతుకు పోరాటం… ఊరూరా తిరిగి…!
పొదిలి పట్టణంలో గత మూడు రోజులుగా ఒంటెలు సందడి చేస్తున్నాయని తెలుసుకున్న పొదిలి టైమ్స్ బృందం ఒంటెలతో నడుచుకుంటూ వెళ్తున్న యజమానులను కలిసి పలు ఆసక్తికర విషయాలను తెలుసుకుంది.
అసలు వాళ్ళ కులవృత్తి ఎంటి?
ఒంటెలలతో వాళ్ళు ఏం చేస్తారు?…. అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం!
పొదిలి పట్టణంలో మరియు సమీప గ్రామాల్లో ఒంటెలు గత మూడు రోజులుగా సందడి చేస్తున్నాయని తెలుసుకున్న పొదిలి టైమ్స్ బృందం వారిని కలుసుకున్న సందర్భంగా పొదిలి టైమ్స్ తో వారు మాట్లాడుతూ నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రాంతం నుంచి బయలుదేరి పట్టణాలు, గ్రామాల మీదుగా వచ్చామని….. అనాదిగా వస్తున్న తమ కుల వృత్తిలో భాగంగా 6నెలలు పాటు బిక్షాటన చేసి 6నెలలు స్వగ్రామంలో ఉంటామని అని తెలిపారు.
నేటి ఆధునిక కాలంలో కూడా బిక్షాటన కులవృత్తిగా ఎంచుకుని దేశధిమ్మరులుగా తిరగడం ఏంటని ప్రశ్నించగా…..
కాలం మారింది, ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మమ్మల్ని గుర్తించే నాథుడే లేడని అలా ప్రభుత్వాలు అధుకుంటే కుటుంబంతో కలిసి ఆనందంగా ఉంటాము కానీ ఇలా ఊరూరా తిరుగుతూ బిక్షాటన చేసుకునే పరిస్థితి ఉండదు అని వాపోయారు.
బిక్షాటన చేసినా కూడా మాతో తిరుగుతున్న మూగ జీవాలైన ఒంటెలకు అలాగే మాకు సరిపడా తిండి కూడా తినలేని పరిస్థితి ఉందని…… 6నెలలు బిక్షాటనలోనే కాలం గడుపుతున్నప్పటికీ మిగిలిన 6నెలల కాలం కనీసం పూట గడవని పరిస్థితి ఉందని తెలిపారు.
మా బతుకు పోరాటం గురించి తెలిసిన వారు బిక్షం అందిస్తారని అందరికీ మేము బిక్షాటన కోసమే వచ్చామని తెలియదు…. కొంతమంది పిల్లలని ఒంటెలపై ఎక్కించుకున్నందుకు గాను ఎంతోఅంత సహాయం చేస్తారని….. ఊరూరా ఈ ఒంటెలతో సందడి చేస్తూ బిక్షాటన చేస్తూ ఈ బతుకుబండి ఇలా లాగుతున్నామని….
ప్రభుత్వాలు మమ్మల్ని కూడా మనుషులుగా గుర్తించి సహాయం చేస్తే మేము కూడా ఈ బిక్షాటన వదిలేసి పనులు చేసుకుంటామని తెలిపారు.